అర్ధరాత్రి వేళ కోళ్ల చోరీ..

theft of hens

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించిన నలుగురు దుండగులు పందెం కోళ్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది&period; ఎప్పటి లాగానే గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చిన్న కోళ్ల ఫారంలో నిదురిస్తున్న మెతుకుమిల్లి శ్రీనివాసరావు&comma; పద్మావతి దంపతులను కత్తులు మెడపై పెట్టి చంపేస్తామని బెదిరించిన నలుగురు గుర్తు తెలియని దుండగులు&period; కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన అగంతకులు మెరుగైన 11 పందెం కోడిపుంజులను చోరీ చేశారు&period; బయటకు అరిస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించినట్లు బాధితులు శ్రీనివాసరావు&comma; పద్మావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కోడిపుంజులను చోరీ చేసి దుండగులు ఉడాయించగా&comma; అక్కడే ఉన్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించగా&comma; అగంతకులు స్టార్ట్ కాకుండా చేశారని వాపోయారు&period; ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..