ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాటా ఐపీఎల్ 2026 సందడికి రంగం సిద్ధమైంది.

Advertisements

<p>భాగ్యనగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది&period; ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాటా ఐపీఎల్ 2026 సందడికి రంగం సిద్ధమైంది&period; ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు జరిగే ఏడు కీలక మ్యాచ్‌à°² కోసం భాగ్యనగరం ముస్తాబైంది&period; సుమారు 39 వేల మంది ప్రేక్షకులు తరలివస్తారని అంచనా వేస్తున్న వేళ&period;&period; పోలీసులు నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు&period; ఇవాళ్ల మధ్యాహ్నం 12 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి&period; వరంగల్ హైవే నుంచి వచ్చే భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు&period; ఎల్బీ నగర్ నుంచి వచ్చే లారీలను నాగోల్ వైపు&period;&period; ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను బోడుప్పల్ వైపు దారి మళ్లిస్తూ రాచకొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>స్టేడియం లోపల&comma; బయట కలిపి మొత్తం 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు&period; లా అండ్ ఆర్డర్&comma; ట్రాఫిక్ విభాగాలతో పాటు స్పెషల్ ఫోర్స్&comma; బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి&period; 430 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి మూలనూ నిశితంగా పరిశీలించనున్నారు&period; ముఖ్యంగా మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పహారా కాయనున్నాయి&period; మ్యాచ్ చూడటానికి వెళ్లే వారు నిబంధనలు పాటించాల్సిందే&period; ల్యాప్‌టాప్‌లు&comma; కెమెరాలు&comma; బ్యాగులు&comma; వాటర్ బాటిళ్లు&comma; బయటి ఆహార పదార్థాలను స్టేడియంలోకి అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు&period; సిగరెట్లు&comma; లైటర్లతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు&period; కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు&period; స్టేడియం సమీపంలో వాహనాల నిలుపుదలపై నిషేధం విధించిన నేపథ్యంలో&period;&period; ప్రేక్షకులు మెట్రో లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతున్నారు&period; మెట్రో రైళ్ల వేళలను కూడా మ్యాచ్ సమయానికి అనుగుణంగా పొడిగించేలా చర్యలు తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.