మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.

మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్

Advertisements

<p>పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది&period; మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు&period; ఈ ఖాతాల్లో సుమారు 440&period;42 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు&period; ఏవియేషన్ రంగానికి చెందిన &&num;8216&semi;కేర్‌వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌&&num;8217&semi;కు సంబంధించి జరుగుతున్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ సుదీర్ఘ దర్యాప్తు చేస్తోంది&period; ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్&comma; కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని ఐదు చోట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది&period;ఈడీ ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం&comma; ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీకి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 160 కోట్లను కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్&comma; దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేశారు&period; ఆ తర్వాత 82&period;96 కోట్లను మరో కంపెనీకి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు&period; ఈ నిధులతో 112 కోట్ల వ్యయంతో ఒక ఎంభ్రేయర్ లీగసీ 600 విమానం&comma; ఒక అగస్టా 109 ఎస్‌పీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది&period; వీటిని తిరిగి అధిక ధరకు టీఎంసీకే లీజుకు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది&period; ఈ లావాదేవీల తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందని&comma; అసలు లబ్ధిదారులను గుర్తించకుండా నిధుల మళ్లింపును దాచిపెట్టేందుకే ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు అధికారులు భావిస్తున్నారు&period; హెలికాప్టర్ కొనుగోలుకు విదేశీ నిధులు ఏమైనా వినియోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది&period; ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న టీఎంసీకి&comma; ఈ తాజా పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది&period; ఈ నిధుల మూలాలపై ఆ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు గతంలోనే పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.