తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

Advertisements

<p>తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి&comma; షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది&period; శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది&period; దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది&period; ఈ పథకాలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్&period;వి&period; శ్రవణ్ కుమార్ విచారించారు&period; చట్టసభ ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 245&comma; 246లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు&period; ఈ పథకాలకు సంబంధించి జారీ చేసిన 8 జీవోలను రద్దు చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p>విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి&comma; కాంట్రాక్టర్ల బిల్లులు&comma; భూసేకరణ పరిహారం వంటివి పెండింగ్‌లో ఉన్నాయి&comma; నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు&period; మరోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంది&period; ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత పథకాలను ఎవరు అడిగారు&quest;&&num;8221&semi; అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది&period; ప్రభుత్వం వద్ద అదనపు నిధులు ఉంటే ఉచితాలు ఇవ్వవచ్చని&comma; కానీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రాధాన్యత ఉండాలని హితవు పలికింది&period;<&sol;p>&NewLine;<p>2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద ఇప్పటివరకు 13 వేల 484 కోట్లు ఖర్చు చేశారని&comma; కాగ్ నివేదికల ప్రకారం సుమారు 90 కోట్లు అనర్హులకు అందాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు&period; ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్&comma; నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ పథకాలు అమలు చేస్తున్నామని&comma; రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు&period; ఇరుపక్షాల వాదనల అనంతరం&comma; నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ&comma; తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది&period; అయితే&comma; ఈ పథకాలపై తక్షణ స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.