పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన

Advertisements

<p>పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది&period; అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం&comma; ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి&comma; భద్రత&comma; స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది&period; అన్ని పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించింది&period; పౌరుల భద్రతతో పాటు ఇంధన సరఫరా&comma; వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరింది&period; శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ చర్చలు&comma; దౌత్య మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపునిచ్చింది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌&period;&period; అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ దాదాపు ముగిసిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి&period; ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని&comma; అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు&period; హర్మూజ్‌ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే అమెరికా తాజా దాడులు చేపట్టిందని తెలిపారు&period; ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు శాతానికి పైగా పెరిగాయి&period; ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ కూడా వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.