భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.

భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి

Advertisements

<p>భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది&period; ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది&period; వీటికి అదనంగా తెల్లటి నుక్రా జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా అవతరించబోతుండటం ఆసక్తికరం&period;<&sol;p>&NewLine;<p>నుక్రా త్వరలో ఒక ప్రత్యేక దేశీయ జాతిగా అధికారిక గుర్తింపు పొందనుందని రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం వెల్లడించింది&period; నుక్రా గుర్రంపై మొట్టమొదటి శాస్త్రీయ సర్వే&comma; డాక్యుమెంటేషన్‌ను మొదలైందని&comma; దీనికి ఆమోదం పొందితే&comma; భారతదేశపు తొమ్మిదవ అధికారికంగా గుర్తింపు పొందిన గుర్రపు జాతిగా నుక్రా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది&period; నుక్రాను ఒక ప్రత్యేక గుర్రపు జాతిగా గుర్తించడం జరిగితే ఈ జాతి గుర్రాల అభివృద్ది&comma; సంరక్షణకు తోడ్పడుతుందని&comma; ప్రభుత్వ పరంగాకూడా శాస్త్రీయ పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు&period; గుర్రాలను పెంచే యజమానులకు నుక్రా జాతి గుర్రాల పెంపకంతో మంచి ధరలు పొందవచ్చని అధికారులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>నుక్రా గుర్రం దాని మెరిసే తెల్లటి చర్మం&comma; గులాబీ రంగు ముక్కు&comma; పెదవులు&comma; దృఢమైన శరీరం&comma; ప్రశాంతమైన స్వభావంతో ప్రత్యేకంగా ఉంటుందని అధికారులు వివరించారు&period; సుమారు 160 నుండి 170 సెంటీమీటర్ల ఉండే నుక్రా జాతి గుర్రం&comma; దాని ఓర్పు&comma; చురుకైన నడక&comma; పరుగు ఆకట్టుకునే రూపానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు&period; అరుదైన&comma; పురాతన జాతి గుర్రం జాతులకు రాజస్థాన్ నెలవుగా కొనసాగుతుంది&period; బంగారు రంగు చర్మంతో మెరిసిపోయే మార్వారీ జాతి గుర్రం రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతమైన మార్వారీకి చెందిన ఒక అరుదైన&comma; పురాతన జాతి గుర్రంగా గుర్తింపు పొందింది&period; దీని చెవులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి&period; అలాగే ఈ అశ్వం చాలా ఓర్పుతో ఉంటుంది&period; అలాగే స్వారీ చేసేవారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపిస్తుంది&period; దీంతో మార్వారీ జాతి గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి&period; బంగారు రంగు గుర్రాలు సాధారణంగా తుర్క్‌మెనిస్థాన్‌లో కనిపిస్తాయి&period; వాటిని పలోమినో అని పిలుస్తారు&period; వాటి లక్షణాలతో ఉండే మార్వారీ జాతి గుర్రాలు రాజస్థాన్ లో కూడా మనుగడ సాగిస్తున్నాయి&period;అశాస్త్రీయ పెంపకం పద్ధతుల కారణంగా 1930లలో ఈ జాతి అంతరించిపోయే దశకు చేరుకుంది&period; అయితే భారతీయ పెంపకందారులు&comma; ప్రభుత్వం చొరవతో చేపట్టిన సమష్టి సంరక్షణ చర్యల వల్ల మార్వారీ జాతి గుర్రాలు సంఖ్య పెరిగింది&period;<&sol;p>&NewLine;<p>మార్వారీ జాతి గుర్రాలు కఠినమైన పరిస్థితులున్న రాజస్థాన్ భూభాగం నుంచి వచ్చినందున అవి చాలా తక్కువ నీటితో జీవించగలవు&period; తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను తట్టుకోగలవు&period; అలసిపోకుండా ఎక్కువ దూరం ఎడారిలో ప్రయాణించగలవు&period; ఈ గుర్రాల నడకను సవారీదారులు ఎంతో విలువైనదిగా భావిస్తారు&period; వాస్తవానికి మార్వారీ అశ్వాలను యుద్ధ గుర్రాలుగా పరిగణిస్తారు&period; మార్వారీ గుర్రాలు ధైర్యం&comma; తెలివితేటలు&comma; ఓర్పునకు ప్రసిద్ధి చెందాయి&period; అలాగే వీటిని పవిత్రమైనవిగా భావించి ఉన్నత హోదాకు&comma; రాజరికానికి ప్రతీకలుగా పరిగణించేవారు&period;<&sol;p>&NewLine;<p>మార్వారీ జాతి గుర్రాలు గుజరాత్‌లోని కతియావార్ ద్వీపకల్పానికి చెందిన కతియావారీ జాతికి అశ్వాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి&period; కతియావారీ జాతి గుర్రాలకు కూడా చెవులు లోపలికి వంగి ఉంటాయి&period; ఈ చెవులు అత్యుత్తమ వినికిడి శక్తి కోసం రాడార్‌లా పనిచేస్తాయి&period; తీవ్రమైన ఎడారి ఇసుక తుపానుల నుంచి కూడా ఈ చెవులతో బయటపడగలవని నమ్ముతారు&period; రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా గుడియా గ్రామంలోని మార్వారీ జాతికి చెందిన అరుదైన బంగారు వర్ణపు గుర్రం ఒకటి ఇటీవల భారీ ధరకు అమ్ముడైంది&period; గోల్డెన్ కింగ్‌గా పేరొందిన ఈ అశ్వం ఏకంగా 70 లక్షల రికార్డ్ ధరకు సేల్ అవ్వడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p>మార్వారీ జాతీ గుర్రం కంటే మెరుగైన లక్షణాలతో ఇప్పుడు కొత్తగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం నుక్రా జాతి గుర్రాలను అభివృద్ది చేసింది&period; నుక్రా జాతి గుర్రాలకు కేంద్రం నుంచి రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా గుర్తింపు దక్కితే&period;&period;ఈ జాతి గుర్రాల పోషణ&comma; జనాభా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.