తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Advertisements

<p>తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది&period; జులై&comma; ఆగస్ట్&comma; సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు&comma; ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది&period; సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది&period; ముఖ్యంగా సిఫార్సు లేఖలపై ఆధారపడి దర్శనానికి వచ్చే భక్తులు&comma; ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది&period;<&sol;p>&NewLine;<p>జులై నెలలో నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతరాయం కలగనుంది&period; తిరుమల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు&period; జులై 14 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా&comma; జులై 17ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా&&num;8230&semi;వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు&period; జులై 19 ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద కార్యక్రమం నేపథ్యంలో&comma; జులై 29 జీయర్‌ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఆగస్ట్ నెలలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి&period; ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది&period; ఆగస్ట్ 22à°¨ పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా&&num;8230&semi;&period; ఆగస్ట్ 24à°¨ పవిత్రాల సమర్పణ కార్యక్రమం ఉన్నందున వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు&period;<&sol;p>&NewLine;<p>ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి&period; దీంతో ఈ నెలలో ఎక్కువ రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి&period; సెప్టెంబర్ 8à°¨ బ్రహ్మోత్సవాల ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా&&num;8230&semi;&period; సెప్టెంబర్ 14à°¨ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా&&num;8230&semi; సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు&period;<&sol;p>&NewLine;<p>వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందు రోజులలో&comma; ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చి చెప్పింది&period; అయితే&comma; ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది&period; పర్వదినాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున&comma; సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు&period; కావున&comma; తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు తేదీలను జాగ్రత్తగా గమనించి&comma; అనవసర ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.