పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..

Advertisements

<p>ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; నాలుగు యూరప్ దేశాల పర్యటనకు వెళ్లనున్న ఆయన&comma; మార్గమధ్యంలో కేవలం మూడు&comma; నాలుగు గంటల పాటు అబుదాబిలో ఆగే అవకాశం ఉంది&period; ఈ స్వల్ప వ్యవధిలోనే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ప్రధాని సమావేశం కానున్నారు&period; అయితే&comma; ఈ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని యూఏఈ పర్యటనకు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది&period; ముఖ్యంగా&comma; మే 1 నుంచి చమురు ఉత్పత్తి దేశాల కూటమి నుంచి యూఏఈ వైదొలగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకం కానున్నట్లు తెలుస్తోంది&period; ప్రపంచ ముడి చమురు ధరలను ప్రభావితం చేయడంలో ఒపెక్ పాత్ర కీలకం&&num;8230&semi; కాగా&comma; ముడి చమురు దిగుమతులపై దృష్టి పెట్టిన భారత్‌కు&period;&period; తాజా పరిణామాలతో ఇంధన ధరలు&comma; సరఫరా ఒప్పందాల విషయంలో సరికొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది&period; ఈ ఏడాది జనవరిలో యూఏఈ అధ్యక్షుడు భారత్‌లో పర్యటించగా&period;&period; ఏప్రిల్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్&comma; విదేశాంగ మంత్రి ఎస్&period; జైశంకర్ యూఏఈకి వెళ్లి వచ్చారు&period; అంతకు ముందు 2022లో మాజీ అధ్యక్షుడి మృతికి సంతాపం తెలిపేందుకు మోదీ యూఏఈ వెళ్లారు&period; రెండు దేశాల అగ్రనేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం&comma; తాజా దౌత్యపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ ఆకస్మిక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..