కేపీహెచ్ బీ లో తగలబడిన దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు..

Advertisements

<p>హైదరాబాద్ నగరంలో భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది&period; మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తున్న &&num;8216&semi;శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్&&num;8217&semi;కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు&comma; కెపిహెచ్‌బి పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్ క్యాబిన్ నుండి పొగలు వచ్చాయి&period; మంటలను గమనించిన డ్రైవర్&comma; క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యి&comma; బస్సును పక్కకు ఆపి&comma; అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు&period; ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు&period; ఆ తర్వాత మంటలు వేగంగా విస్తరించి&comma; బస్సును పూర్తిగా మింగేశాయి&period; సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తెచ్చారు&period; ఈ ప్రమాదంతో జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది&period; వాహనదారులను వేరే మార్గాల్లోకి మళ్లించడం ద్వారా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు&period; బస్సు కాలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు&period; ప్రాథమిక విచారణలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్&comma; ఏసీ యూనిట్‌లో సాంకేతిక సమస్యల వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు&period; ఫోరెన్సిక్ టీమ్స్ బస్సును పరిశీలించాక అసలు కారణం తెలిసే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.