ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

Advertisements

<p>ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి&period; జిల్లాలోని సింగరాయకొండ&comma; ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన సుబ్బారావు&&num;8230&semi; వారికి తాత్కాలిక నివాసం కల్పించి తన సరుగుడు&comma; సుబాబుల్&comma; జామాయిల్ తోటల్లో పనులు చేయిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p>అయితే వారిని నిర్బంధించి బలవంతంగా పనులు చేయించుకుంటూ&comma; తగిన కూలి చెల్లించకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆరోపించారు&period; ఇదే సమయంలో ఓ గిరిజన మహిళపై సుబ్బారావు అత్యాచారానికి పాల్పడ్డాడని&comma; దీనిని ప్రశ్నించిన ఆమె భర్తపై దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల ద్వారా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారికి ఫిర్యాదు చేశారు&period;<br &sol;>&NewLine;ఫిర్యాదుపై స్పందించిన జేసీ కల్పనా కుమారి సంబంధిత అధికారులతో కలిసి తొర్రగుడిపాడు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు&period; బాధిత మహిళను స్వయంగా విచారించగా&comma; తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె వెల్లడించినట్లు అధికారులు తెలిపారు&period; ఇతర గిరిజన కుటుంబ సభ్యులు కూడా తమతో బలవంతంగా పనులు చేయించుకుంటున్నట్లు జేసీ దృష్టికి తీసుకువచ్చారు&period;దీంతో నిందితుడు బత్తుల సుబ్బారావుపై ఎస్సీ&comma; ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు&period; నాలుగు కుటుంబాలకు చెందిన 18 మంది గిరిజనులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు&period; బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా&period;&period; నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.