మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌

Advertisements

<p>సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది&period; మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు&period; మీనాక్షి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం&&num;8230&semi; ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది&period; మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది&period; మీనాక్షి నటరాజన్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు&period; వాడీవేడీగా వాదనలు జరిగాయి&period; నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న ఘటనలు గతంలో ఉన్నాయా అని పిటిషనర్‌ను సుప్రీం ప్రశ్నించింది&period; అలాంటి తీర్పులు ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది&period; ఈ తీర్పుతో చాలా మంది ఇక నుంచి కేసులు వేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు&period; వాదోపదావనల తర్వాత మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు&period; అయితే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది&period; అక్కడా న్యాయం జరగకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.