తుమ్మిడిహట్టిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..

Advertisements

<p>తుమ్మిడిహట్టిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది&period; ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది&period; ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు&period; MCHRDలో నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి&comma; ఇంజినీర్లు&comma; నిపుణులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమగ్రంగా చర్చించారు&period; తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ను ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చన్న అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశముంటుందని&comma; తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని వివరించారు నిపుణులు&period; ఇప్పటికే నిర్మించిన కాల్వలు&comma; మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన ఎత్తు అని సూచించారు&period; దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి&period;&period;తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణం వేగవంతం చేస్తూనే 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు&period; మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరిపి అనుమతులు సాధించాలన్నారు&period; ఇందుకు కేంద్ర సహకారం కోసం మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయాలని ఆదేశించారు&period; ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ఇప్పటికే చేసిన భారీ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలని&period;&period;అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 100 టీఎంసీల నీటి వినియోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>గత చర్చల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని&period;&period;152 మీటర్లకు మించి నిర్మిస్తే ఆ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉంటుందని నిపుణులు వివరించారు&period; ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తు మధ్యేమార్గంగా సరైనదని అభిప్రాయపడ్డారు&period; మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు ప్రభావం ఉంటే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు&period; వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాలని&period;&period;అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండడంతో కేంద్ర సహకారం కోరాలని సూచించారు&period; ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు&period; అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ అవసరాన్ని వివరించే బాధ్యతను ఉత్తమ్‌కే అప్పగించారు&period; ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాతోపాటు తెలంగాణ మెట్ట ప్రాంతాల రైతులకు సాగునీరు&comma; తాగునీరు అందుతుందని&period;&period;తక్కువ ఖర్చుతో గ్రావిటీ ఆధారంగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..