కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు ,అవనిగడ్డ డివిజన్ డి.ఎస్.పి మురళీధర్ పరివేక్షణలో కోడూరు మండలం మందపాకల గ్రామ రెవెన్యూ పరిధిలోని రొయ్యలు సాగు చెరువులు వద్ద పేకాట నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తన సిబ్బందితో మెరుపు దాడి చేశారు..
సంఘటన లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారు వద్ద నుంచి 61 800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రమేష్ తెలిపారు .ఈ సందర్భంగా సిఐ ఎల్ రమేష్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ పోలీసు అధికారులకు తెలియజేస్తే వారి నెంబర్లు గోపియ్యం, ఉంచుతామన్నారు .ఆసంఘీక కార్యక్రమాలు పాల్పడినవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు…అదేవిధంగా దీపావళి పండగ పర్వదినాన పురస్కరించుకుని అనుమతులు లేకుండా ముందుగండి సామాగ్రి గాని తమ గృహాల వద్ద గాని తన షాపుల్లో గాని ఉంచితే వెంటనే తమకు ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే ఆకస్మికంగా సాపులను తనిఖీలు చేసి అట్టి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగానే ముందుకుండి సామాగ్రిని అమ్మకాలు చేపట్టాలని సూచించారు .ఈ సమావేశంలో తనకు ఎస్సైవి.రాజేంద్రప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు…
అవనిగడ్డలో పేకాట శిబిరాల పై పోలీసుల మెరుపు దాడి..
137
previous post