ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది&period; ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరం పెట్టేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు&period;  సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆమె ఈ కీలక విషయాన్ని వెల్లడించారు&period; సోషల్ మీడియాను నియంత్రించడం&comma; అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి అనిత వివరించారు&period; ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైందని&comma; పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు&period; తమిళనాడు&comma; కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కమిటీ సమీక్షించిందని&comma; రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేసే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>విద్వేషపూరిత&comma; అసభ్యకరమైన పోస్టులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని&comma; ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పోస్టులకు సంబంధించి 1&comma;384 కేసులు నమోదు చేసి&comma; 1&comma;067 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఆమె సభకు తెలియజేశారు&period;గతంలో ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా &&num;8216&semi;వయసుకు తగిన సోషల్ మీడియా వాడకం&&num;8217&semi; కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను అధ్యయనం చేస్తామని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ అంశాన్ని టీడీపీ జాతీయ స్థాయిలోనూ ప్రస్తావించింది&period; ఫిబ్రవరి 10à°¨ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర సమాచార&comma; ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు&period; పిల్లల కోసం సోషల్ మీడియాపై వయోపరిమితితో కూడిన నియంత్రణ తీసుకురావాలని కోరారు&period; దీనిపై అధ్యయనం చేసి ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు&period; ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని&comma; పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం పటిష్టమైన చట్టాన్ని రూపొందించే పనిలో ఉందని కేంద్ర మంత్రికి వివరించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.