జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు&period;అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్&period; వివిధ అంశాలపై చర్చించారు&period; అనంతరం సేనా గళం పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు&period; రాజ్యాంగానికి కట్టుబడి జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా సేనా గళం కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు&period;<br &sol;>&NewLine;సమకాలీన రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం&comma; మతం&comma; ప్రాంతం వంటి సున్నితమైన అంశాల ముసుగు వేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు&period; వ్యక్తిగత తప్పిదాలకు సామాజిక వర్గాలను బాధ్యుల్ని చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని&comma; ఈ తరహా రాజకీయాలను నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;సేనా గళం’ కమిటీ&period;&period; రాజ్యాంగ విలువలకు కట్టుబడి&comma; దేశ సమగ్రతకు భంగం కలగకుండా పనిచేస్తుందని తెలిపారు&period; ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపిస్తుందని దిశానిర్దేశం చేశారు&period; వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప&comma; ఆ వ్యవహారంలోకి కులాలను&comma; మతాలను లాగకూడదనేది జనసేన పార్టీ స్పష్టమైన విధానమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.