ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగానికి కట్టుబడి జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా సేనా గళం కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
సమకాలీన రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల ముసుగు వేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పిదాలకు సామాజిక వర్గాలను బాధ్యుల్ని చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ తరహా రాజకీయాలను నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.
‘సేనా గళం’ కమిటీ.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ సమగ్రతకు భంగం కలగకుండా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపిస్తుందని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, ఆ వ్యవహారంలోకి కులాలను, మతాలను లాగకూడదనేది జనసేన పార్టీ స్పష్టమైన విధానమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.
279
previous post