అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం

Advertisements

<p>అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి&period; వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి&period; జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది&period; కేరళ మూలాలున్న భారత సంతతి యువకుడు డేవ్ ఫిజీకి మే 29à°¨ జెస్నితో ఘనంగా వివాహం జరిగింది&period; పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం నూతన వధూవరులు హెలికాప్టర్‌లో అట్లాంటాకు బయల్దేరారు&period; అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ పర్వత ప్రాంతంలో కూలిపోయింది&period;ఈ ప్రమాదంలో ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పనిచేస్తున్న డేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు&period; వధువు జెస్ని శిథిలాల కింద చిక్కుకుపోయినప్పటికీ సహాయక బృందాలు ఆమెను సురక్షితంగా బయటకు తీశాయి&period;<br &sol;>&NewLine;వాతావరణం అనుకూలంగా లేదని&comma; ప్రయాణం వాయిదా వేయాలని డేవ్ మొదట భావించినట్లు ఆయన తండ్రి జార్జ్ ఫిజీ వెల్లడించారు&period; అయితే తర్వాత ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలని నిర్ణయించుకుని హెలికాప్టర్‌లో బయల్దేరినట్లు తెలిపారు&period; ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా&comma; ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో విడుదల కానున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.