అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు..

Advertisements

<p>రాష్ట్రంలోని అనాథ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది&period; అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు&comma; ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది&period; సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో జీఎంఆర్ ఏరో అకాడమీ&comma; ఫిక్కి&comma; అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది&period; ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ&comma; అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత&comma; వారికి కేవలం ఆశ్రయం కాదు&comma; భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం అన్నారు&period;<&sol;p>&NewLine;<p>పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి&comma; ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు&period; సమగ్ర పునరావాసం&comma; శిక్షణ&comma; ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు&period; మూడేళ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి&comma; అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు&period; మారుతున్న కాలానికి&comma; అవ‌à°¸‌రాల‌కు అనుగుణంగా అంగ‌న్వాడీ టీచ‌ర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్యక్రమం మార్చి నుండి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది&period; ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్&comma; కార్గో&comma; గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి&comma; ప్రైవేట్&comma; అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం&period; మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారు&period; ఆ à°¤‌ర్వాత బ్యాచ్ à°² వారిగా అర్హులంద‌రికి ట్రైనింగ్ ఇవ్వ‌నున్నారు&period; ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ హెడ్ కే&period; అనంతరామన్&comma; ఆపరేషన్స్ హెడ్ ప్రీతి&comma; మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్&comma; డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఇండస్ట్రీ ట్రైనింగ్&comma; సాఫ్ట్ స్కిల్స్&comma; డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీలేడిస్ అర్గ‌నైజేష‌న్ తో à°®‌హిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుంది&period; స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్&comma; అవినాష్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ సర్టిఫైడ్ కోర్సులు అనాథ బాలిక‌లకు నేర్పిస్తారు&period; క్లాస్ రూం టుం కార్పోరేట్ జాబ్ లక్ష్యంగా 30 గంటల శిక్షణా మాడ్యూల్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలు సిద్దం అయ్యేలా తీర్చిదిద్ద‌నున్నారు&period; మొత్తం 300 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&comma; కమ్యూనికేషన్&comma; ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వ‌డం ద్వారా మంచి ఉద్యోగులు వారికి à°²‌భించేలా చేయ‌నున్నారు&period;<&sol;p>&NewLine;<p>అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేయడానికి అజీమ్ ప్రేమ్ జీ యునివ‌ర్సిటీ తో కలిసి 6 నెలల ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు అమలు చేయనున్నారు&period; ఎర్లి చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న్ అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది&period; అంగ‌న్వాడీ టీచ‌ర్లంద‌రికి ఈ మోడల్ ద్వారా శిక్షణ ఇస్తారు&period; 30 గంటల ఆన్‌లైన్ సెషన్లు&comma; 6 రోజుల ప్రత్యక్ష శిక్షణ కలిపి 6 నెలల వ్యవధిలో కోర్సు పూర్తి అవుతుంది&period; విజయవంతంగా పూర్తి చేసిన వారికి అజీమ్ ప్రేమ్ జీ యునివ‌ర్సిటీ సర్టిఫికేషన్ అందిస్తుంది&period; టీచింగ్&comma; కేరింగ్&comma; పిల్లల బోధనలో సామర్థ్య పెంపు ఈ శిక్షణలో ప్రధానాంశాలు&period; మారుతున్న అవసరాలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 3 నుండి 6 సంవత్సరాల చిన్నారుల పాఠశాల సంసిద్ధతను మెరుగుపరచడమే à°²‌క్షంగా ఈ కోర్సు à°ª‌నిచేయ‌నుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.

హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.

నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.