అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కొరుతున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు ముషీరాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు నామినేషన్ ర్యాలీ రామ్ నగర్ చౌరస్తా నుండి ప్రారంభమైంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. భారీ ర్యాలీగా వచ్చిన పూసరాజు ముషీరాబాద్ లో ట్యాంక్ బండ్లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని లక్ష్మణ్ తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. దాచుకోవటం దోచుకోవటం కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మణ్ వెల్లడించారు భారీ మెజారిటీతో ముషీరాబాద్ బిజెపి అభ్యర్థి పూసరాజును గెలిపించాలని ముషీరాబాద్ ప్రజలను లక్ష్మణ్ కోరారు
ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదు – లక్ష్మణ్
132
previous post