149
గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే అరటి పండ్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.పోషకాలు,కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అరటిపండ్లలో పోషకాల స్థాయిలను గమనిస్తే ఒక 80గ్రాముల అరటిపండును తీసుకోవడం ద్వారా 65కిలో క్యాలరీల ఎనర్జీ,1గ్రాము ప్రోటీను,0.1 ఫాట్16. 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్,1.1 గ్రాముల ఫైబర్,264మిల్లి గ్రాముల పొటాషియం అందుతాయి. అరటిపండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. అరటిపండ్లలోని ఫైబర్ కారణం గా కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్స్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు పనిచేస్తాయి.