ఇండియా పోస్టల్ లో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం

Advertisements

<p>ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త&comma; వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది&period; ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు&comma; పత్రాల కోసం రోజులతరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు&period; కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా&comma; సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి న్యూఢిల్లీలోని గ్యారెంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవల్ని ప్రారంభించారు&period; ఇండియా పోస్ట్ తన నెట్ వర్క్ ను ఈ కొత్తసేవలతో మరింత బలోపేతం కానుంది&period; ఇందులో మూడు కేటగిరీలను వినియోగదారులకు పరిచయం చేసింది&period; ఉత్తరాలు&comma; పత్రాల కోసం 24 స్పీడ్ పోస్ట్&comma; వస్తువుల ఫాస్టెస్ట్ డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్&comma; నిర్ణీత సమయంలో డెలివరీ చేసే సేవల కోసం 48 స్పీడ్ పోస్ట్ కేటగిరీలను తీసుకొచ్చింది&period; తొలివిడతలో ఆరునగరాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు&period; హైదరాబాద్&comma; బెంగళూరు&comma; ఢిల్లీ&comma; ముంబై&comma; చెన్నై&comma; కోల్ కతా వంటి నగరాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్&period; 24 గంటల్లో ఇండియా పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభించడం ద్వారా 30 కోట్లమంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు&period; కొత్తగా వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందన్నారు&period; లాజిస్టిక్స్ లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోందని పెమ్మసాని పేర్కొన్నారు&period; ఎస్ఎంఎస్ ట్రాకింగ్&comma; ఓటీపీ డెలివరీ&comma; జియో ట్యాగింగ్ విధానాలను ఇండియా పోస్ట్ డెలివరీల్లోనూ అమలు చేస్తున్నామని&comma; 24-48 గంటల్లో 98 శాతం డెలివరీలు పూర్తిచేయాలన్నదే ప్రధాన లక్ష్యమని వివరించారు&period; ప్రైవేట్ కొరియర్లతో పోలిస్తే తపాలాశాఖలో ధరలు తక్కువగా ఉంటాయన్నారు&period; అలాగే బిజినెస్ కస్టమర్లకు బుక్ నౌ &&num;8211&semi; పే లేటర్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు&period; ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదని&comma; వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణ అని అభివర్ణించారు&period; ఇండియాపోస్టులో ఆర్థిక అభివృద్ధి కీలకమని పెమ్మసాని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.