ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం- కవిత

tdp and ycp

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం&comma; నిరసనలు&comma; తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు&period; చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం&comma; కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టడం వంటి అంశాలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు&period;<br>పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ఇక్కడి రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు&period; ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని కవిత పేర్కొన్నారు&period; హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని హితవు పలికారు&period;<br>ఆంధ్రా అంశాలపై ఇక్కడెందుకు ధర్నాలు చేయాలి&quest; అలాంటి కార్యక్రమాలతో హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా&quest; అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు&period; దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారని&comma; ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు&period;<br>కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని&comma; ఎప్పుడూ ధర్నాలు&comma; గొడవలు&comma; నిరసనలు&comma; కర్ఫ్యూలు ఉంటాయని&comma; ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత ఎద్దేవా చేశారు&period; పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత విమర్శించారు&period;<br>చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా కవిత తన అభిప్రాయాలను స్పష్టం చేశారు&period; &&num;8220&semi;ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణం&period; దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నాం&period; ఇది ఆయా పార్టీలు&comma; వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయం&period; తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం&period; ఇది టీడీపీ&comma; వైసీపీ చూసుకోవాల్సిన విషయం&&num;8221&semi; అని కవిత ఉద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..