ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా.

Advertisements

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా&comma; ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వంపై ఫోకస్‌ పెట్టింది&period; ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు&period;&period;అంటే దాదాపు 92 కోట్లకు పైగా రివార్డు ఇస్తామని సంచలన ప్రకటన చేసింది&period; అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ &OpenCurlyQuote;రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది&period; మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సైనికాధికారుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది&period; ఫిబ్రవరి 28à°¨ జరిగిన దాడిలోనే మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా&comma; ఆయన కుమారుడు&comma; ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు&period; ఈ దాడిలో ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండొచ్చని&comma; అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం లేదని అమెరికా అనుమానిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>గత మూడు వారాలుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా&comma; ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు 15వేలకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి&period; ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం&comma; డ్రోన్ల శక్తి 95 శాతం క్షీణించినట్లు పెంటగాన్ తెలిపింది&period; ఇక ఇరాన్‌పై దాడులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ట్రంప్‌&period; మరోవైపు&comma; ఇరాన్ కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది&period; దీంతో బ్యారెల్ చమురు à°§à°° 100 డాలర్లు దాటి&comma; ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి&period; ఈ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ప్రజలే తమ నాయకత్వాన్ని కూలదోస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.