ఇరాన్‌ యుద్ధ సంక్షోభంలో భారత్‌కు బిగ్‌ రిలీఫ్.

Advertisements

<p>పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది&period; ఈ క్రమంలో భారత్‌కు భారీ ఊరట లభించింది&period; రష్యా ముడి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది&period; ఈ మేరకు యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ &OpenCurlyQuote;ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు&period; తాత్కాలికంగా 30 రోజుల పాటు రష్యా ఆయిల్‌ కొనేందుకు భారత్‌కు వెసులుబాటు కల్పించారు&period; ఈ మేరకు ఆంక్షలు సడలిస్తున్నామని&period;&period;ఇరాన్‌ చర్యల వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు&period; దీంతో ప్రపంచ మార్కెట్‌లోకి చమురు సరఫరా అవుతుందన్నారు&period; ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు&period; దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు&period; ఈ సందర్భంగా అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అన్న బెసెంట్‌&period;&period; భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.