టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

Advertisements

<p>తిరుమలలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు&period; ఫిబ్రవరి 6à°¨ ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన&comma; ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు&period; గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆలయ వ్యవహారాలపై సమగ్ర అవగాహన పెంచుకున్నట్లు ఆయన తెలిపారు&period;సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు&period; క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలనలు నిర్వహిస్తానని తెలిపారు&period; భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా&comma; సౌకర్యవంతమైన దర్శనం అందేలా&comma; అలాగే నాణ్యమైన ప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు&period; భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా టీటీడీ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ముద్దాడ రవిచంద్ర తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.