ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Advertisements

<p>పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది&period; ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; పెట్రోలియం శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు&period; ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని&comma; దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>కేంద్ర ప్రభుత్వం మార్చి 8à°¨ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం&period;&period; దేశంలోని రిఫైనరీలు&comma; పెట్రోకెమికల్ సంస్థలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది&period; పారిశ్రామిక అవసరాల కంటే గృహ వినియోగదారులకు సరఫరా చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది&period; అయితే హోటళ్లు&comma; రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ పంపిణీని కొంతవరకు క్రమబద్ధీకరించారు&period; కానీ ఆస్పత్రులు&comma; విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి కోత లేకుండా నిరంతరం వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది&period; గ్యాస్ ఏజెన్సీలు&comma; నిల్వ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని&comma; అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించింది&period; ప్రతిరోజూ గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించాలని డీజీపీలకు ఆదేశాలు అందాయి&period; అలాగే&comma; కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని అస్సలు వదలవద్దని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది&period; పాత వీడియోలు లేదా సంబంధం లేని ఫోటోలను పెట్టి ప్రజలను భయపెట్టే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది&period; ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని&comma; అవగాహన కల్పించాలని కోరింది&period; దీనికోసం కేంద్ర హోంశాఖ&comma; సమాచార ప్రసార శాఖ&comma; పెట్రోలియం శాఖల సమన్వయంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది&period; గ్యాస్ సరఫరాపై ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్రాలు వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా స్పష్టత పొందవచ్చని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గగన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల.

నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.

ఇరాన్ అంశంపై సెనేట్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం.