ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Advertisements

<p>ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; దీనివల్ల సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి రానుంది&period; కుటుంబ సర్వే నివేదిక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 46&comma;113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; అమరావతి కేంద్రంగా విడుదలైన ఈ ఆదేశాలు రైతాంగంలో హర్షాన్ని నింపుతున్నాయి&period; ఈ నెలాఖరులోగా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం విశేషం&period; పెండింగ్‌లో ఉన్న 46&comma;113 దరఖాస్తులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సుమారు రూ&period;250 కోట్ల వ్యయం చేయనుంది&period; ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది&period; పెండింగ్ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 10&comma;000 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయించాలని నిర్ణయించింది&period; దీనివల్ల విద్యుత్ సరఫరాలో లో వోల్టేజ్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..