ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు, ఏడాదిలో రూ.10 లక్షల లావాదేవీలు దాటితే PAN తప్పనిసరి.

Advertisements

<p>ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే PAN కార్డుకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది&period; లావాదేవీ పరిమితులను గణనీయంగా పెంచింది&period; కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది&period; ఇందులో భాగంగా పాన్‌కు సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది&period; ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి&period; ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ&period;10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా&comma; ఉపసంహరించుకున్నా పాన్‌ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది&period; ఒకటే బ్యాంకు లేదా వేర్వేరు బ్యాంకుల్లో జరిగినా ఈ నిబంధన వర్తిస్తుంది&period; ప్రస్తుతం ఒక రోజులో రూ&period;50 వేలు దాటితేనే పాన్‌ అడుగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇళ్లు&comma; స్థలాల కొనుగోలు&comma; అమ్మకం&comma; బహుమతి లేదా ఉమ్మడి డెవలప్‌మెంట్‌ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ&period;20లక్షలు దాటితే ఇకపై పాన్‌ తప్పనిసరి&period; ప్రస్తుతం ఈ పరిమితి రూ&period;10 లక్షలుగా ఉంది&period; స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రెట్టింపు చేయడం గమనార్హం&period; ద్విచక్ర వాహనం సహా ఏ మోటారు వాహనమైనా&comma; దాని à°§à°° రూ&period;5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్‌ సమర్పించాల్సి ఉంటుంది&period; పాత చట్టంలో ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన లేదు&period; కార్లకు&comma; ఇతర మోటారు వాహనాలకు ధరతో సంబంధం లేకుండా పాన్‌ సమర్పించాల్సి వచ్చేది&period; కొత్తగా రూ&period;5 లక్షల పరిమితిని తీసుకొచ్చారు&period; హోటళ్లు లేదా రెస్టారెంట్ల బిల్లులు&comma; కన్వెన్షన్‌ సెంటర్లు&comma; ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు చేసే చెల్లింపులు రూ&period;లక్ష దాటితే ఇకపై పాన్‌ సమర్పించాలి&period; ప్రస్తుతం హోటల్‌&comma; రెస్టారంట్‌ బిల్లు రూ&period;50 వేలు దాటితే పాన్‌ ఇవ్వాల్సి వస్తోంది&period; ఈ మొత్తాన్ని రెట్టింపు చేశారు&period; ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం రూ&period;50వేలు దాటితేనే పాన్‌ అడుగుతున్నారు&period; ఇకపై ప్రతి పాలసీకి పాన్‌ సమర్పించడం తప్పనిసరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.