కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి. దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు. అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే, జట్టు రాలిపోవడం సమస్య తగ్గుతుంది. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి వారు కూరల్లో వేసిన కరివేపాకుని తినడమే కాదు… దాని మిశ్రమాన్ని తలకి పట్టించుకుని, కాసేపయ్యాక శుభ్రపరుచుకున్నా మంచిదే. కొన్ని వారాల్లోనే జుట్టు నల్లగా మారడం గమనిస్తారు. జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని మాడుకీ, వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి. పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
కరివేపాకు తో జుట్టు నిగనిగ
117
previous post