అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే దేశంలోని బాబర్లు, ఔరంగజేబ్‌లను ప్రోత్సహించడమేఅని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలపై దౌర్జన్యాలు మొదలవుతాయి. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలోనూ అదే జరిగింది. ఆ రాష్ట్రంలోని బాబర్లు, ఔరంగజేబులకు ఎక్కడి నుంచి ఆక్సిజన్ అందిందో తెలియదు కానీ, చెలరేగడం మొదలుపెట్టారు అని సీఎం హిమంత ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమంత ప్రసంగించారు. అక్టోబర్ 18న ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అక్బర్‌ను ఓడించి ఇంటికి పంపకపోతే కౌసల్య మాత భూమి అపవిత్రం అవుతుంది. ఒక అక్బర్‌ను ఎక్కడో ఒకచోట అనుమతిస్తే.. అతడు 100 మంది అక్బర్‌లను పిలుచుకుంటాడు. కాబట్టి అతన్ని వీలైనంత త్వరగా పంపేయాలి అని అప్పట్లో హిమంత పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు కూడా పంపింది. అయినా అసోం సీఎం మళ్లీ అదే తరహా కామెంట్స్‌ను చేయడం గమనార్హం.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబర్లు, ఔరంగజేబ్‌లను ప్రోత్సహించినట్టే..
148
previous post