కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలు

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు&period; నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు&period; అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి&comma; ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు&period; ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని&comma; కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు&period; నెహ్రూ&comma; ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు&period; తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని&comma; కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు&period; ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్&comma; బీజేపీ&comma; ఎంఐఎం సహకరించుకుంటాయన్నారు&period; అసోం&comma; రాజస్థాన్&comma; మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు&period; పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు&period; ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు&period; రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని&comma; బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.