61
నేను నామినేషన్ వేయకుండా ఆపడం కోసం ఉదయం ఐదు గంటల కే ఐటీ అధికారులు వచ్చారని,నాకు సంబంధించిన వారి దగ్గర ముప్పై మూడు చోట్ల తనిఖీ చేశారని,చివరకు చిత్తు కాగితాలు తీసుకుని పోయా రని అన్నారు.నేను నామినేషన్ వేయకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారని,కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసేందుకు నాలాగా గట్టిగా మాట్లాడే వారి నోరు నొక్కడం కోసం ఇట్లాంటి రైడ్లు చేస్తున్నారని అన్నారు. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలే రని,ప్రజల దీవెనలు ఉన్నంత వరకు మీరెన్ని కుట్రలు చేసిన ప్రతిఫలం మీరు అనుభవిస్తారని అన్నారు.