40
జనగాం జిల్లా జనగామ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి పేరును ప్రకటించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. జనగామ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లను పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు కంచరాములు మాట్లాడుతూ కొమ్మూరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసికి ధన్యవాదాలు చెప్పారు. జనగామ నియోజకవర్గంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.