రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి.. చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు ఏం చేయలేదని, డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేగాక గురుకులాల ప్రతిష్టను పూర్తిగా మంట గలిపారని, అందుకే గురుకులాలను రిపేర్ చేసే బాధ్యత తీసుకున్నానని చెప్పినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఒక్క గురుకులాలకే కాదు.. అన్ని సాంఘీక సంక్షేమ విద్యాలయాలకు డైట్ చార్జీలు పెంచారని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మరణిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. పిల్లలు చనిపోతుంటే కదలని ప్రభుత్వం.. ఒకే మెనూ పేరుతో పిల్లలతో కలిసి భోజనం చేసి, పెద్ద డ్రామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన గురుకుల బాట కార్యక్రమం పిక్‌నిక్ లాగా జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి