Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు

by Rama
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు

రాష్ట్ర విభజన తరువాత వరుసగా తెలంగాణలో వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల పేర్లు మారుతున్నాయి. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. అయితే, రేవంత్ చేసిన కామెంట్స్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. హైదరాబాద్‌ లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ లో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని గుర్తు చేశారు. ఆ తదనంతర పరిణామాలతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన ఉన్న ఇంటిని మెమోరియల్‌గా మారుస్తామని అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: