Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

by Rama
న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం నుంచి ముఖ్యమంత్రి అతిశీ, గ్రేటర్ కైలాశ్ స్థానంలో సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అందుకే ఈ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌తోనూ అమీతుమీకు తాము సిద్ధమేననే సంకేతాలను పంపేందుకు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ అధినేత ఎంచుకున్నారు. అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని వెల్లడించింది. బీజేపీ మిస్సింగ్.. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదంటూ ఆప్ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ను తిట్టడం తప్ప, ఢిల్లీ కోసం బీజేపీ ఏమీ చేయలేదని ఆప్ దుయ్యబట్టింది. ఢిల్లీ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న ఆప్‌కే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.
    అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని…
  • ‘కాగితం పడవలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం.
    ‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. సినిమా కచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’.…
  • భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.
    అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 నుంచి 107 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. WTI క్రూడ్ కూడా 101 డాలర్ల మార్కును దాటింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ…
  • పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
    పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
  • “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
    “15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: