కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Congress

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది&period; పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు&period; ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు&period; ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు&period; తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు&period; హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని&comma; ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కోల్పోతోందని చెప్పారు&period; నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు&period; అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దిన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు&period; కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు&period; ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని&comma; ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు&period; అనుచరులు&comma; అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు&period; కాగా&comma; పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..