నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి అయితే కార్తికమాస పర్వదినాలు, సెలవురోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీకమాసమంతా గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధమల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు అదేవిధంగా కార్తీకమాసంలో రద్దీ రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని కార్తీకమాసమంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయగా అలానే కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసమన్నారు శని, ఆది, సోమవారం అలానే రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు అలానే కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు నిర్ణయించామని టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని దేవస్థానం ఈవో పెద్దిరాజు నిర్ణయించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని తెలిపారు.
కార్తీక మాసోత్సవాలు..
127
previous post