Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Health ఆరోగ్యానికి జామ ఆకు

ఆరోగ్యానికి జామ ఆకు

by Satya
Jamaku

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా… వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: