102
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలకు దారితీసింది. మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూకడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు.