జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు, వంతెనను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు.లక్ష్మీ బ్యారేజ్ కుంగడం పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేశంలో జరిగిన కుంభకోణాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటి అన్నారు. గతంలో నిర్మించిన ఎల్లంపల్లి,SRSP ప్రాజెక్టులకు ఏలాంటి డోకా లేదన్నారు. బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు తెలియజేయాలి. ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ చేపట్టాలని,బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేసారు.
Medigadda Lakshmi
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలకు దారితీసింది. మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూకడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు.
తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. బ్యారేజ్ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 5.71 టీఎంసీల నీటిమట్టం ఉంది. దీంతో ఒక గేటును ఎత్తి 2,357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 వరకు ఇటీవల కుంగిపోయింది. బ్యారేజీ గోడలకు పగుళ్లు వచ్చాయని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అధికారులు స్పందించి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది. కాగా, లక్ష్మీ బ్యారేజీ నిర్మాణ దశలోనే 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసి బ్యారేజీని ప్రారంభించారనే ఆరోపణలూ వినిపించాయి. తాజాగా పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోకి నీటి ఎత్తిపోతలను నిలిపేసినట్లు సమాచారం.




Total views : 78283