సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మేకప్ రిమూవర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. కాలిన గాయాలూ, ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి. కనురెప్పలకి రాసే మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి.
కొబ్బరినూనెతో కళ
116
previous post