తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాలపాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాల చిగుళ్లనుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. కాలిఫ్లవర్ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది. కాలిఫ్లవర్ క్యాన్సర్నని దూరంగా ఉంచును . కాలిఫ్లవర్లో ఉండే రసాయనాలు క్యాన్సర్ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది. కాలిఫ్లవర్ని తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, ఇంకా బ్లాడర్ క్యాన్సర్ వంటి పలు క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫ్లవర్లో ఉండే గ్లూకోసినోలేట్స్, ధయోసయనేట్స్ లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్ధరైటిస్ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. కాలిఫ్లవర్ లో విటమిన్ C – కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ స్త్రీలు కనీసం 400 మైక్రోగ్రామ్స్ అయినా తీస్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాలీఫ్లవర్ తో ఎంతో ఆరోగ్యం
142
previous post