పువ్వులోని గింజల నుంచే పొద్దు తిరుగుడు ఆయిల్ ను తీస్తారు. మనం ఇళ్లలో వంట నూనె కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్ నూనెనే వాడుతుంటాం. అయితే.. సన్ ఫ్లవర్ గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నిజానికి సన్ ఫ్లవర్ ఆయిల్ గుండె కు మంచిదంటారు. అందుకే చాలామంది ఆ ఆయిల్ నే వాడుతుంటారు. కానీ.. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. పొద్దు తిరుగుడు నూనెతో మీ పొడిచర్మాన్ని సైతం మృదువుగా మార్చుకోవచ్చు. శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది. పొద్దు తిరుగుడు నూనె పొడి చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడే సహజ నూనె. విటమిన్ E అధికంగా ఉండే ఈ నూనె తేమను బంధిస్తుంది. చర్మ కణాలలో తేమను నిలుపుకుంటుంది. పొద్దు తిరుగుడు నూనె ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఎన్నో మంచి గుణాలు
126
previous post