గల్ఫ్‌ దేశాల్లో మరింత పెరిగిన ఉద్రిక్తతలు.

Advertisements

<p>గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి&period; కీలక గ్యాస్‌&comma; చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నాయి ఇరాన్‌&comma; ఇజ్రాయెల్‌&comma; అమెరికా&period; తమ నేతలు నేతలు లారిజానీ&comma; నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖతీబ్‌ మరణానికి ప్రతీకారంగా&period;&period;క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్‌&period; ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీపై బాంబుల వర్షం కురిపించింది ఇరాన్‌&period; ఈ దాడిలో ఖతార్‌ ఆర్థికవ్యవస్థకు పునాదిగా ఉన్న ఇండస్ట్రియల్‌ సిటీ భారీగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి ఆ దేశ వర్గాలు&period; దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది&period; మరోవైపు సౌదీ అరేబియా కూడా అంతకుముందు 8 బాలిస్టిక్‌ మిసైల్స్‌ను అడ్డుకొన్నట్లు వెల్లడించింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అవసరమైతే సైనిక చర్యను తీసుకొనే హక్కు తమకుందని సౌదీ హెచ్చరికలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;<p>యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్‌ ఆయిల్‌ ఫీల్డ్‌పై ఇరాన్‌ దాడులు చేసింది&period; దీంతోపాటు హబ్‌షాన్‌ గ్యాస్‌ కాంప్లెక్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకొంది&period; ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌షోర్‌ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం&period; దీంతో యూఏఈ ప్రభుత్వం ఇక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది&period; మరోవైపు యూఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది&period; యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 20కి పైగా నౌకలు&comma; ట్యాంకర్లపై దాడులు జరిగాయి&period; పశ్చిమాసియాలో భీకర దాడులతో క్రూడాయిల్‌ బ్యారెల్‌ à°§à°° 110 డాలర్లకు చేరింది&period;<&sol;p>&NewLine;<p>ఖతార్‌ గ్యాస్‌ కేంద్రంపై దాడి విషయంలో ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు&period; అమాయకపు ఖతార్‌పై ఇరాన్‌ తెలివి తక్కువగా దాడి చేసిందని&period;&period;ఇదే కొనసాగితే ఇజ్రాయెల్‌ సాయం ఉన్నా&comma; లేకపోయినా&period;&period; తాము ఇరాన్‌పై మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు&period; పార్స్‌ గ్యాస్‌ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు&period; తాను ఆ స్థాయి హింస&comma; వినాశనాన్ని కోరుకోవడం లేదని&period;&period;ఖతార్‌ ఎల్‌ఎన్‌జీపై మరోసారి దాడి చేస్తే ఏమాత్రం సహించనని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..