గాజాపై మరోసారి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్‌

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్‌

Advertisements

&NewLine;<p>గాజాపై మరోసారి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్‌ చేసింది&period; గత ఆదివారం రాత్రి ఓసారి భూతల దాడి చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ &period;&period; మళ్లీ బుధవారం అర్థరాత్రి కూడా ఉత్తర గాజా బార్డర్ ఏరియాలపై స్వల్ప స్థాయిలో ఎటాక్స్ నిర్వహించింది&period; ఇందులో భాగంగా హమాస్‌కు సంబంధించి మొత్తం 250 స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించింది&period; ఈసందర్భంగా హమాస్ కమాండ్‌ సెంటర్లు&comma; సొరంగాలు&comma; రాకెట్‌ లాంచర్లు&comma; యాంటీ ట్యాంక్‌ క్షిపణి ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది&period; ఉత్తర గాజాలోని నివాసాల మధ్యే రాకెట్‌ లాంచర్లు ఉన్నాయని గుర్తించామని ఆరోపించింది&period; గాజాలో ఇంధన వనరులు పూర్తిగా అయిపోయాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ చేయడం గమనార్హం&period; అయితే ఈ దాడుల్లో ఇరువైపులా ఎంతమేర ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు తెలియరాలేదు&period; మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ పట్టణంలో 75 మంది ఉంటున్న ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ గగనతల దాడి చేసింది&period; ప్రాణనష్టం గురించి తెలియరాలేదు&period; ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన గాజా పౌరుల సంఖ్య 6500 దాటింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.