తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి వచ్చిన బోర్డు తిప్పేసిన 9fx గ్లోబల్ ట్రెండింగ్ సభ్యుల గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు. రాయచోటి డిఎస్పీ కార్యాలయం నందు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి తో కలిసి డిఎస్పీ మహబూబ్ బాషా మీడియా సమావేశం. 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ గ్రూప్ సభ్యులను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు. రసూల్ సాహెబ్,యోగనంద చౌదరిలు ఇద్దరు క 2019 లో 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ యాప్ ను ప్రారంభించారు. వీరికి రాయచోటి కి చెందిన సుబ్బారెడ్డి ద్వారా తిరుపాల్ రెడ్డి పరిచయం అయ్యాడు. రాయచోటి,కడప, నెల్లూరు రాజేష్,చంద్ర మౌళిశ్వర రెడ్డి,మల్లికార్జున ల ద్వారా ఆయా ప్రాంతాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసి వీరిని డైరెక్టర్లుగా నియమించారు. వీరి కింద 302 మంది ఏజెంట్లను నియమించి వారి ద్వారా సుమారు 1759 మంది దగ్గర ఇందులో పెట్టుబడులు పెట్టించారు. 1759 సభ్యులు ఈ కంపెనీలో రు.170 కోట్లు నగదును డిపాజిట్ చేయడం జరిగింది. వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో వచ్చే లాభం ద్వారా గ్రూప్ సభ్యులకు చెల్లించాలన్నది ఈ యాప్ యొక్క ఉద్దేశం. డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అనువైన భూములు దొరకలేదు. దీంతో వచ్చిన నగదు కన్నా చెల్లించాల్సిన డబ్బు ఎక్కువైంది. పెట్టుబడుదారులకు సుమారు రు.105 కోట్లు,ప్రమోటర్లకు వివద రకాల కమిషన్ రూపంలో రు.65 కోట్లు చెల్లించడం జరిగింది. 2022 అక్టోబర్ నెలలో అన్ని ప్రాంతాలలో నున్న బ్రాంచ్ కార్యాలయాలు మూతపడ్డాయి. 2023 ఎప్రైల్ నెలలో గోల్డెన్ ఫార్మర్స్ డవలపర్ pvt.ltd అనే రియల్ ఎస్టేట్ పేరున రిజిస్టర్ చేయించి రాజేష్, చంద్రమౌళిశ్వర ల ఇద్దరినీ డైరెక్టర్లుగా నియమించారు. నెల్లూరు జిల్లా దత్తలుర్ మండలం నందిపాడు వద్ద 22 ఎకరాలు అనిల్ కుమార్ పేరున రిజిస్టర్ చేయించి అందులో అందులో శాండిల్ వుడ్ చెట్లు వేసి,ప్లాట్లు గా వేసి వాటి ద్వారా వచ్చే డబ్బును మిగితా సభ్యులకు చెల్లించాలనుకొన్నరు. నష్టపోయిన బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యాప్ ప్రారంభించిన వారితో పాటు ఆరు మందిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాలు వెల్లడించిన డిఎస్పీ మహబూబ్ బాష .
గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు..
97
previous post