గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు..

Rayachoti police

Advertisements

&NewLine;<p>తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి వచ్చిన బోర్డు తిప్పేసిన 9fx గ్లోబల్ ట్రెండింగ్ సభ్యుల గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు&period; రాయచోటి డిఎస్పీ కార్యాలయం నందు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి తో కలిసి డిఎస్పీ మహబూబ్ బాషా మీడియా సమావేశం&period; 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ గ్రూప్ సభ్యులను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు&period; రసూల్ సాహెబ్&comma;యోగనంద చౌదరిలు ఇద్దరు క 2019 లో 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ యాప్ ను ప్రారంభించారు&period; వీరికి రాయచోటి కి చెందిన సుబ్బారెడ్డి ద్వారా తిరుపాల్ రెడ్డి పరిచయం అయ్యాడు&period; రాయచోటి&comma;కడప&comma; నెల్లూరు రాజేష్&comma;చంద్ర మౌళిశ్వర రెడ్డి&comma;మల్లికార్జున ల ద్వారా ఆయా ప్రాంతాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసి వీరిని డైరెక్టర్లుగా నియమించారు&period; వీరి కింద 302 మంది ఏజెంట్లను నియమించి వారి ద్వారా సుమారు 1759 మంది దగ్గర ఇందులో పెట్టుబడులు పెట్టించారు&period; 1759 సభ్యులు ఈ కంపెనీలో రు&period;170 కోట్లు నగదును డిపాజిట్ చేయడం జరిగింది&period; వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో వచ్చే లాభం ద్వారా గ్రూప్ సభ్యులకు చెల్లించాలన్నది ఈ యాప్ యొక్క ఉద్దేశం&period; డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అనువైన భూములు దొరకలేదు&period; దీంతో వచ్చిన నగదు కన్నా చెల్లించాల్సిన డబ్బు ఎక్కువైంది&period; పెట్టుబడుదారులకు సుమారు రు&period;105 కోట్లు&comma;ప్రమోటర్లకు వివద రకాల కమిషన్ రూపంలో రు&period;65 కోట్లు చెల్లించడం జరిగింది&period; 2022 అక్టోబర్ నెలలో అన్ని ప్రాంతాలలో నున్న బ్రాంచ్ కార్యాలయాలు మూతపడ్డాయి&period; 2023 ఎప్రైల్ నెలలో గోల్డెన్ ఫార్మర్స్ డవలపర్ pvt&period;ltd అనే రియల్ ఎస్టేట్ పేరున రిజిస్టర్ చేయించి రాజేష్&comma; చంద్రమౌళిశ్వర ల ఇద్దరినీ డైరెక్టర్లుగా నియమించారు&period; నెల్లూరు జిల్లా దత్తలుర్ మండలం నందిపాడు వద్ద 22 ఎకరాలు అనిల్ కుమార్ పేరున రిజిస్టర్ చేయించి అందులో అందులో శాండిల్ వుడ్ చెట్లు వేసి&comma;ప్లాట్లు గా వేసి వాటి ద్వారా వచ్చే డబ్బును మిగితా సభ్యులకు చెల్లించాలనుకొన్నరు&period; నష్టపోయిన బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యాప్ ప్రారంభించిన వారితో పాటు ఆరు మందిని అరెస్ట్ చేశాం&period; అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాలు వెల్లడించిన డిఎస్పీ మహబూబ్ బాష &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..