గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే “సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల”. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో గల ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి. వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు. చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రం లో వున్నప్పుడు లేదా తులారాశిలో స్వాతి నక్షత్రంలో వున్న సమయంలో కొన్ని రసాయన అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. వృషభ,తులా ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి. భార్గవమహర్షికి జన్మించిన లక్ష్మీ దేవికి శుక్రుడు సోదరుడు కావటం వలన శుక్రుడు రోహిణి,స్వాతి నక్షత్రాల్లో తన స్వంత రాశుల్లో వన్న సమయంలో ఈ చక్రాల ఉద్భవించటంచేత వీటికి లక్ష్మీదేవి కటాక్షం వుంది అని పెద్దలు తెలియచేస్తుంటారు. వీటి ఉపయోగాలు అనేకం అనంతం అని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుందంటారు. దీనినే “నాగచక్రం” అని “విష్ణుచక్రం” అనికూడ అంటారు. ఇది నత్త గుల్ల ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని “నత్త గుల్ల రాయి” అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. కొన్ని గోమతిచక్రాల ముందుభాగం తెల్లగాను, మరికొన్ని కొన్నిఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకలకార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు
వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగిస్తారు కొందరు. గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సులో గా ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడు ధనాని లోటు ఉండదు. గోమతి చక్రాలను బ్రాస్లేట్ గా అమర్చుకొని చేతికి ధరిస్తే కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొ డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళి డబ్బులు అడిగితే మనం అప్పుగా ఇచ్చిన డబ్బులను త్వరగా రాబట్టుకొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని
మంగళవారం రోజు చేస్తే ప్రయోజన కలుగుతుంది అని అంటారు. ఇలా గోమతి చక్రంను సరైన విధంగా వుపయోగించటంవల్ల లక్ష్మీకటాక్షంతో పాటు, శుక్రగ్రహ దోషాలు తొలగి జీనితం సుఖంగా, సంతోషంగా వుంటుంది, అలాగే ధనానికి లోటు వుండదు. ఈ గోమతి చక్రాలను ఉబ్బేత్తుగా వున్న వైపు క్రిందకి వుంచి నునుపుగా వున్న వైపు పైకి వుంచాలి. కొందరు వీటిని ఉబ్బెత్తుగా వున్న వైపు పైకి వుంచుతారు. ఇలా వాడటం ప్రయోజనం కాదని తెల్సుకోవాలి.
గోమతి చక్రాలు ఉపయోగాలు
190
previous post