చంద్రుడిపై విక్రమ్ లాండింగ్ తో గాల్లోకి ఎగిసిన దుమ్ము

Chandrayan-3

Advertisements

&NewLine;<p>చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశానికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది&period; ప్రపంచదేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది&period; ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అందరూ చాలా ఉత్సుకత ప్రదర్శించారు&period; ఈ ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది&period; విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో అక్కడి ఉపరితలంపై దాదాపు 2&period;06 టన్నుల దుమ్ము గాల్లోకి లేచింది&period; మట్టి&comma; రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టులు గుర్తించారు&period; చంద్రుడి కక్షలోనే తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని విశ్లేషించారు&period; ల్యాండింగ్‌కు కొన్ని గంటల సమయం ముందు&comma; ఆ తర్వాత తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు&period; డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన ప్రక్రియ కారణంగా భారీగా దుమ్ము పైకి లేచినట్లు శాస్త్రవేత్తలు వివరించారు&period; కాగా&period;&period; దుమ్ము భారీగా ఎగిసిపడిన ప్రభావంతో ఆ ప్రాంతం ప్రకాశవంతంగా మారింది&period; ఇలా జరగడాన్ని &OpenCurlyQuote;ఎజెక్టా హాలో’ అని అంటారు&period; దాదాపు 108&period;4 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు&period; ఇలాంటి పరిణామాల సమయంలో చంద్రుడి దుమ్ము ప్రతిస్పందన తీరును తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.